వాస్తు కరెక్షన్లు చేస్తే సీఎం అయిపోతారా ?

గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు.. మీరు బతుకుతున్న బతుకులో ప్రతి రూపాయి జగనన్న ఇచ్చిందే, జగనన్నకు మీరు  రుణపడి ఉండాల్సిందే అని టముకు వేశారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే గనుక, మీరు పొందుతున్న ప్రభుత్వ పథకాలు అన్ని ఆగిపోతాయి అని భయపెట్టారు. ఇదంతా కొన్ని నెలల నుంచి జరుగుతున్న ప్రహసనం. తీరా ఎన్నికల సీజన్ మొదలైన తరువాత.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ దళాల మీద మరొక రకం దాడులు మొదలుపెట్టారు. తోడేళ్లు గుంపులుగా వస్తున్నాయని తాను సింహంలా ఎదుర్కొంటున్నానని డప్పు కొట్టుకున్నారు. అర్జునుడిలా తాను యుద్ధం చేస్తుంటే.. ప్రతిపక్షాల వాళ్ళందరూ కౌరవులలో అతని మీదకు దాడి చేస్తున్నారని కూడా వర్ణించుకున్నారు. నేను పంచిన డబ్బులు మీ ఇంట్లో అంది ఉంటే మాత్రం నాకు ఓటు వేయండి.. లేకపోతే ఓటు వేయవద్దు అని ప్రగల్బాలు పలుకుతూ.. తన సంక్షేమ పథకాల లబ్ధి పొందిన వారు ఓటు వేస్తే చాలు తిరుగులేని మెజారిటీతో గెలుస్తానంటూ విర్రవీగారు. తమాషా ఏమిటంటే ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయినట్లున్నాయి. కొత్త భయాలు పుడుతున్నాయి. ఎన్నికలలో నెగ్గాలంటే ప్రజలను కాకుండా అడ్డదారుల అవసరమనే నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తున్నారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి లోని ప్యాలెస్ కు వాస్తు మార్పులు చేయిస్తున్నారు. ఎన్ని టక్కు టమార గజకర్ణ గోకర్ణ గారిని విద్యలు ప్రదర్శించినప్పటికీ… ఎన్నికలలో నెగ్గి మళ్లీ ముఖ్యమంత్రి కావడం అసాధ్యం అని జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద వాస్తు మార్పులను ఆగమేఘాలమీద చేయిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నివాస భవనం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం రెండు పక్కపక్కనే ఉంటాయి. జగన్ ప్యాలెస్ లకు చుట్టుపక్కల పెద్ద భవంతులు, విల్లాలు ఉన్నాయి. ఆ విల్లాల్లోంచి జగన్ ఇంటి వరండాలో తిరిగేవారు కనిపించే పరిస్థితి ఉండేది. దాంతో అటువైపు ప్రహరీ గోడ లాగా పెద్ద ఎత్తయిన ఇనుప కుడ్యం నిర్మించారు. ఇప్పుడు వాస్తు మార్పుల పేరుతో ఆ ఇనుపకుడ్యం కొంత మేర కట్ చేసి తొలగిస్తున్నారు.

ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తూ ఉండడంతో..  జగన్ జాగ్రత్త పడుతున్నారు. అయినా జ్యోతిష్యులను వాస్తు విధ్వాన్సులను పిలిపించి తన పరిస్థితి గురించి ఆరా తీసినట్లు, తక్షణ నివారణ చర్యలను గురించి విచారించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వాస్తు సిద్ధాంతల సూచన మేరకే ఆ ఇనుప గోడను కొంతమేర తొలగించే పనులు ముమ్మరంగా చేస్తున్నట్లుగా సమాచారం. ఇంటిలో ఒకవైపు ఒక గోడ కొంతమేర కూల్చినంతమాత్రాన ప్రజలలో వ్యతిరేకత వెల్లువెత్తుతుండగా జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ముఖ్యమంత్రి అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories