టాలీవుడ్ యంగ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏదోక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా అక్కినేని వారసుడు నాగచైతన్యతో విడాకులు అయ్యాక సామ్ పాపులారిటీ మరింత పెరిగిపోయింది. సమంత ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా అది ఓ పెద్ద సెన్సేషనే అయిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అంతగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు జనాలు.
ఇటీవల సమంత ఏప్రిల్ 28 న తన పుట్టిన రోజు వేడుకలను గ్రీస్ దేశంలోని ఏథెన్స్‌లో జరుపుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఏథెన్స్‌లో తాను తిరిగిన ప్రదేశాల ఫొటోలు కూడా షేర్ చేసింది. దీంతో కొంత మంది .. సమంత ఎంతో సంతోషంగా, జాలీగా అక్కడ వీధుల్లో తిరుగుతుంది. నా జీవితం నా ఇష్టమొచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తాను, మధ్యలో విమర్శలు చేయడానికి మీరెవరు? అని ప్రశ్నించినట్లుగా ఉన్నట్లుందని అంటున్నారు.
అలాగే సమంతకు ఎక్కడా పని లేదా..ఏకంగా గ్రీస్ దేశానికి వెళ్లి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలా..అంటూ నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తూ, ట్రోల్ చేస్తున్నారు. దీంతో వారిపై సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సామ్ లైఫ్ సామ్ ఇష్టం.. మధ్యలో మీకెందుకు.. ఆమెను ట్రోల్ చేయడమే మీరు పనిగా పెట్టుకున్నట్లు ఉన్నారుగా అంటూ ఫైర్ అవుతున్నారు.