ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్ ఆయన వారసురాలిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ప్రముఖ యంగ్ డైరెక్టర్ మారుతీ డైరెక్షన్ లో ది రాజా సాబ్ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ తో ఓ ప్రాజెక్టులో ఆమె భాగస్వామిగా మారింది.
ఆమె తరువాతి సినిమా పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న “తంగలాన్”. ప్రస్తుతం ఈ సినిమాల సంగతి పక్కన పెడితే ఆమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అండ్ పాపులర్ అనే విషయం తెలిసిందే. ఆమె తన అభిమానులు, ఫాలోవర్స్ కోసమే అన్నట్లు పలు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. సోమవారం ఆమె తన ఫాలోవర్స్ తో X.comలో చిట్ చాట్ సెషన్ లో అనేక రకాల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
అందులో పెళ్లి ఎప్పుడని ఓ అభిమాని అడగ్గా, “”నేను పెళ్లి చేసుకోవాలని ఎందుకు తొందరపడుతున్నావు?” అని ఆమె ప్రశ్నించింది. మొదటి సెలబ్రిటీ క్రష్ గురించి అడిగితే ఆమె హృతిక్ రోషన్ అని వెల్లడించింది. బొడ్డుకు రింగ్స్ లాంటివి పెట్టించుకోవడం గురించి ప్రస్తావిస్తే ఈ చాట్ కింకీ సెషన్ కాదని ఆమె అతనికి తెలియజేసింది. “సరే, మీరు ప్రశ్నోత్తరమైన ప్రశ్నోత్తరాల కోసం చూస్తున్నారు, నేను మేధోపరమైన వినోదం కోసం చూస్తున్నాను అని ఆమె కూడా అంతే నాటీగా సమాదానం ఇచ్చింది.
ఇక ఆమె స్కిన్షోలు చేయడం మానేసి, మరింత సీరియస్గా నటించడం ఎప్పుడు ప్రారంభిస్తుంది అని అభిమాని అడిగినప్పుడు, ఆమె కాస్త ఘాటుగానే స్పందించింది. గ్లామర్ షో ఎప్పటికీ ఆపను అని సమాదానం ఇచ్చింది. ఆమె “నాకు ఇష్టం. సింపుల్… దానితో సమస్య ఉందా?” అని ప్రశ్నించింది. ఆమె ప్రభాస్ చిత్రంలో నటించడానికి హైదరాబాద్కు రెగ్యులర్ ట్రావెల్స్ చేస్తూ ఉంది కాబట్టి హైదరాబాద్ ఫుడ్ గురించి అడిగితే ఈ ఆహారం చాలా స్పైసీగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది.