సజ్జల కుట్రప్రచారాలకు సునీత ఘాటైన కౌంటర్!

ముఖ్యమంత్రి ప్రజల ఎదుటకు, మీడియా ఎదుటకు వచ్చి మాట్లాడవలసిన ముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు.. ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి తరఫున సకలశాఖా మంత్రిగా అందరూ ప్రేమగా పిలుచుకునే సజ్జల రామక్రిష్ణారెడ్డి వస్తుంటారు. ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక ప్రకటన చేస్తారు. నిజానికి ఆ ప్రకటన చాలా సుదూర వ్యూహంతో కూడుకున్నది అయి ఉంటుంది. సజ్జల ఏ మాటలైతే చెబుతారో.. అది పార్టీ విధానం అన్నమాట. అదే మాటలను ఆ తర్వాత మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు ప్రకటనల రూపంలోను, కిందిస్థాయి కార్యకర్తలు టీ బంకుల వద్ద, నాలుగురోడ్ల కూడళ్లలో చర్చల రూపేణా ప్రజల్లోకి వ్యాప్తి చేయించడానికి ప్రయత్నిస్తుంటారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎపిసోడ్- తన తండ్రి హత్య విషయంలో అసలు దోషులకు శిక్ష పడాలని న్యాయం కోసం పోరాడుతున్న సునీత ఎపిసోడ్ లలో కూడా అధికార పార్టీ ప్రతిస్పందనలు ప్రతిసారీ సజ్జల నుంచే వినవస్తుంటాయి. ఆయన సునీత క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి, ఆమె విశ్వసనీయత మీద అనుమానాలు రేకెత్తించడానికి చాలా వ్యూహాత్మకమైన ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడంతా గోబెల్స్ యుగమే నడుస్తున్నది కాబట్టి ఒక కుట్రపూరితమైన ప్రచారాన్ని తమ సొంత మీడియా సంస్థలతో, సోషల్ మీడియా దళాలతో  విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలరు కాబట్టి.. ప్రజలను నమ్మించేయగలం అనుకుంటూ ఉంటారు. అయితే తన  గురించి సజ్జల ఆ తరహాలో లేవనెత్తిన ఒక విషపూరితమైన ప్రచారాన్ని సునీత చాటా ఘాటుగా తిప్పికొట్టారు. సజ్జల సమాధానాలు వెతుక్కోవాల్సిన పరిస్థితిని కల్పించారు.

తెలుగుదేశం పావులాగా సునీత ప్రవర్తిస్తున్నదనే భావం కమ్యూనికేట్ చేసేలా.. ఆమె ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ భార్య చనిపోతే ఆయన ఇంటికి వెళ్లినట్టుగా సజ్జల ఆరోపించారు. దీనికి సునీత గట్టి కౌంటరే ఇచ్చారు. ‘అవును ఆమె నా పేషెంట్ కాబట్టే వెళ్లాను. సజ్జల రామక్రిష్ణారెడ్డి అన్న చనిపోయినప్పుడు వాళ్ల ఇంటికి కూడా వెళ్లాను. సజ్జలకు అది గుర్తు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి చనిపోయినప్పుడు ఆమెను కూడా కలిసాను. మానవత్వాన్ని కూడా మీ రాజకీయ ప్రయోజనాలకు సంకుచితంగా ప్రచారం చేస్తారా అంటూ సునీత నిలదీశారు.

మీడియా ముందు నిల్చుని సుతిమెత్తటి పదాలతో ప్రత్యర్థుల మీద అడ్డగోలుగా బురద చల్లుతూ ఉండే సజ్జల దీనికేం సమాధానం చెబుతారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories