ఏ మాయ చేశావో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై అక్కినేని వారి కోడలై.. ఆ తరువాత ఆ బంధానికి ముగింపు పలికి సినిమాలు చేసుకుంటు ఉన్న స్టార్ నటి సమంతకు ఓ నెటిజన్ నుంచి ఓ షాకింగ్ ప్రశ్న ఎదురైంది. దీంతో అతనికి ఆమె అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది.
విడాకులు తీసుకున్న తరువాత అటు చైతు కానీ , సమంత కానీ ఎవరి జీవితం వారే గడుపుతున్నారు. తాజాగా సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సమంత తన అభిమానులు, నెటిజన్లతో సోషల్ మీడియాలో ముచ్చటించింది.
ఆ క్రమంలోనే ఓ నెటిజన్ ఆమెను ట్యాగ్ చేస్తూ… సమంత గారు మీ అమాయకపు భర్తని ఎందుకు మోసం చేసారు..? అంటూ ప్రశ్నించాడు.
దీంతో ఆ ప్రశ్నకు గట్టి కౌంటర్ ఇచ్చింది అమ్మడు. సమంత బదులిస్తూ.. సారీ ఇలాంటి ఆరోపణలు చేయడం మీకు మంచిది కాదు. మీకు ఇంకా బలమైనవి కావాలి. మీ ఆలోచనల్లో మార్పు రావాలి. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అంటూ సామ్ కామెంట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.