మరోసారి వాయిదా పడ్డ ప్రభాస్‌ సినిమా!

సలార్‌ సినిమాతో గతేడాది బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించిన ప్రభాస్‌.. ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని నాగాశ్విన్ డైరెక్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన కల్కి టీజర్, పోస్టర్ విపరీతమైన అంచనాలను క్రియేట్‌ చేశాయి. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను.. చివరికి వచ్చే నెల 9న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మరో సారి వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. కొత్త రిలీజ్ డేట్ ఏప్రిల్ 17 అని చిత్రం బృందం అనౌన్స్ చేసింది. కాగా, మూవీ సీజీ వ‌ర్క్స్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదని.. అందుకే సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణ, ఏపీ ఎన్నికల నేపథ్యంలో.. ఆ ప్రభావం సినిమా పై పడకూడదని చిత్రబృందం భావించినట్లు సమాచారం.

 భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీలో స్టార్ కాస్ట్ అమితాబ్, కమల్ హసన్, దీపికా పదుకొనె, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.. తాజాగా ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ ప్రభాస్, దిశా పటాని మధ్య జరిగే కొన్ని హాట్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు టాక్‌.

Related Posts

Comments

spot_img

Recent Stories