ఆ క్రేజీ ప్రాజెక్ట్‌ నుంచి శ్రుతి ఔట్‌!

నటి శ్రుతి హాసన్‌ ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది. గతేడాది సంక్రాంతికి రెండు సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో గత రెండు సంవత్సరాలు అన్ని భాషాల్లో సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ తో మరో హిట్ తన అకౌంట్‌ లో వేసుకుంది.

ఇక ప్రస్తుతం సలార్ పార్ట్ 2లోనే కాకుండా అడవి శేష్‌తో కూడా ఓ మూవీ చేస్తుంది. అయితే శ్రుతి ఇటీవల ‘బాఫ్టా’ విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌ ‘చెన్నై స్టోరీ’లో నటిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.  కొద్ది రోజుల క్రితం సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు  ఓ షాకింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రుతి హాసన్ తప్పుకున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. అయితే దీనికి గల కారణాలు ఇంకా బయటికి రాలేదు. ఇదే నిజమైతే ఆమె స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా మారింది.  సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ కోసం స్టార్ హీరోయిన్ సమంతను సంప్రదిస్తున్నట్లుగా  వార్తలు వినపడుతున్నాయి. మరి ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలపైనే సమంంత ఎక్కువ కాన్సట్రేషన్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పే అవకాశాలే బాగా కనిపిస్తున్నాయి.

రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు టాక్‌.  ‘చెన్నై స్టోరీ’లో వివేక్ కల్రా, నిమ్మి హరస్గమా, సహానా వాసుదేవన్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories