నేను బతికి ఉండగా అనుమతివ్వను!

అతిలోక సుందరి శ్రీదేవి గురించి సినీ ప్రపంచానికి పరిచయం అక్కర్లేదు. బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. దాదాపు స్టార్‌ హీరోలందరితో యాక్ట్‌ చేసేశారు. అయితే శ్రీదేవి చనిపోయి ఆరు సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి కూడా ఆమె జీవిత చరిత్రని బయోపిక్‌ గా తీస్తున్నారంటూ చాలా వార్తలు వస్తున్నాయి.

వాటి గురించి తాజాగా శ్రీదేవి భర్త , బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ స్పందించారు. అజయ్‌ దేవగణ్‌… కథానాయకుడిగా నటించిన మైదాన్‌ చిత్రానికి  బోనీ కపూర్‌ కూడా  ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలోకి విడుదల కానుంది. మైదాన్‌ ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీదేవి జీవిత చరిత్రను బయోపిక్ గా తీస్తారని ప్రస్తావన రాగా.. నేను  బతికుండగా మాత్రం ఆమె బయో పిక్‌కు అనుమతివ్వనని బోనీ చెప్పారు.

‘నా భార్య శ్రీదేవి చాలా ప్రైవేట్‌ పర్సన్‌. వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడానికి అస్సలు ఇష్టపదు. ఆమె జీవితం అలా ప్రైవేట్‌గానే ఉండాలి. అయితే ఎప్పటికీ ఉంటుందని నేను అనుకోను. కానీ నేను బతికి ఉన్నంతవరకు మాత్రం బయోపిక్‌కు అనుమతివ్వను’ అంటూ  బోనీ చెప్పుకొచ్చారు.

Related Posts

Comments

spot_img

Recent Stories