ఆర్డీవో ఆఫీస్‌ కు తారక్‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరిసారిగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కనిపించారు. ఈ చిత్రం తో ప్రపంచవ్యాప్తంగా  సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తారక్‌ టాలీవుడ్‌  స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న దేవర చిత్రం లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. సైఫ్‌ ఆలీఖాన్‌ విలన్‌ గా చేస్తున్నాడు. తాజాగా తారక్‌ ఖైరతాబాద్ లోని ఆర్డీవో ఆఫీస్‌ కు వెళ్లాడు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఎన్టీఆర్‌ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పలు చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

తారక్‌ దేవరతో పాటు అటు బాలీవుడ్‌ వార్‌ 2 లో కూడా కనిపించబోతున్న విషయం తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories