ఫుల్‌ స్వింగ్‌ లో బాలయ్య బాబు సినిమా పనులు!

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఎన్బీకే 109. ఈ సినిమా కోసం బాలయ్య బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి చాలా తక్కువ అప్డేట్స్ నే వచ్చినప్పటికీ సినిమా పనులు మాత్రం ఎంతో వేగంగా జరుగుతున్నాయని మాత్రం తెలుస్తుంది.

 సినిమాకు పని చేస్తున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌ ఓ చిత్రాన్ని సోషల్‌ మీడియాలో పంచుకోగా అందులో బాలయ్య బాబు షూట్‌ మోడ్‌ లో ఉన్నట్లు తెలిపారు. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ చాలా వేగంగా జరుగుతుందని… షూటింగ్‌ వేగంగా కంప్లీట్‌ అవుతుందని తెలుస్తుంది.

బాలయ్య వర్క్‌ చేసిన ఈ టెక్నీషియన్‌ నుంచి బాలయ్య బాబు అభిమానులు కూడా మంచి అదిరిపోయే విజువల్స్‌ ని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమా నుంచి పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. 

Related Posts

Comments

spot_img

Recent Stories