చివరికి ముద్రగడ బ్రోకరేజీకే పరిమితమా?

కాపు జాతిని ఉద్ధరించడం కోసమే తాను జీవితాంతం పనిచేస్తూ ఉంటానని చెప్పుకునే ముద్రగడ పద్మనాభం.. ఎట్టకేలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాపు జాతికి సంబంధించి ఎలాంటి కోరికలనూ జగన్ ఎదుట పెట్టకుండానే.. ఆయన బేషరతుగా చేరిపోయారు. జగన్ రాష్ట్రంలో మళ్లీ ఖచ్చితంగా విజయం సాధిస్తారని, జగన్ విజయం కోసం అవసరమైతే రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తానని కూడా ముద్రగడ ప్రకటించారు. ఒకవైపు పార్టీలో చేరడానికి తానేమీ కోరలేదని అంటూనే.. జగన్ గెలిచిన తర్వాత తనకు ఏ పదవి ఇచ్చినా తీసుకుంటానని కూడా మెలిక పెడుతున్నారు. అయితే ఆయనతో రాష్ట్రవ్యాప్త ప్రచారం మాట ఏమో గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం బ్రోకరేజీ పనులకు వాడుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలుగుదేశం- జనసేన పొత్తుల్లో ఉన్న నేపథ్యంలో ఆ రెండు పార్టీల నుంచి అనేక నియోజకవర్గాల్లో నాయకుల అసంతృప్తి సహజంగానే ఉంది. జనసేనకు సంబంధించి చాలా నియోజకవర్గాల్లోని కాపు నాయకులు తమ సీటు జనసేనకు వచ్చి ఉండి, తమకు  టికెట్ దక్కిఉంటే బాగుండేదని అనుకుంటూ ఉన్నారు. అలాంటి వారిలో కొందరి అసంతృప్తి తీవ్రంగా కూడా ఉంది. అలాంటి వారిని వైఎస్సార్ కాంగ్రెస్ లో చేర్చుకోవాలని పార్టీ ఆలోచిస్తోంది.

దీనిద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్టు అవుతుందని జగన్మోహన్ రెడ్డి వ్యూహకర్తలు ప్లాన్ చేస్తున్నారు. ఒకటి- ఓటు బ్యాంకు పరంగా బలమైన కాపు సామాజిక వర్గం వైసీపీపై నమ్మకం పెంచుకుంటున్నట్టుగా రంగు పులమవచ్చు. రెండు- జనసేన పార్టీని అస్థిర పరచి, ఆ పార్టీ ఓడిపోతుందనే భ్రమను ప్రజలకు కలిగించవచ్చు.. అనుకుంటున్నారు.

ముద్రగడ పద్మనాభం.. వైసీపీలో చేరిప్పుడు.. తనను స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాష్ట్రమంతా తిప్పి వాడుకుంటారని ఊహించారు. కానీ ఆయనకు అంత సీన్లేదన్నట్టుగా వైసీపీ వ్యవహరిస్తోంది. కేవలం ఇతర పార్టీల్లోని కాపు నాయకులను వైసీపీ వైపు ఆకర్షించి తీసుకురావడానికి జగన్ తరఫున రాయబారి పనిచేస్తే చాలునని వారు ఆశిస్తున్నారు. ముద్రగడ స్థాయికి ఇది చాలా అవమానకరమైన పని. ఇంకా సూటిగా చెప్పాలంటే..

ఉభయగోదావరి జిల్లాల్లో పరిమితంగా కొందరు కాపుల్లో తప్ప.. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల కాపు నాయకుల్లో ఆయనకున్న క్రెడిబిలిటీ కూడా తక్కువ. మరి ఆయనను ఫిరాయింపుల కోసం ప్రయోగించాలనుకుంటున్న వైసీపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories