మరోసారి దసరా డైరెక్టర్ తో నాని

నేచురల్ స్టార్‌ గతేడాది వరుస సినిమాలతో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అదే స్పీడుతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా నాని సరిపోదా శనివారం అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత యంగ్‌ డైరెక్టర్ సుజీత్‌ తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు నాని ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా నాని మరో సినిమాను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. అది కూడా మరెవరితోనో కాదు… దసరా మూవీ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెలతోనే. వీరిద్దరి కాంబోలో వచ్చిన దసరా సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఈ క్రమంలోనే డైరెక్టర్‌ కి నాని మరో ఛాన్స్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది.

అయితే ఈ సినిమా దసరా కి సీక్వెల్‌ కాదు అని తెలుస్తుంది. త్వరలోనే దసరా సీక్వెల్‌ కూడా రాబోతున్నట్లు సమాచారం. వీరి కాంబో మరో కొత్త సినిమా రాబోతుందని సినీ వర్గాల టాక్‌. నాని ఇచ్చిన ఈ  క్లారిటీతో అటు అభిమానులు కూడా ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా త్వరలోనే స్టార్ట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories