బాలయ్య తో సలార్‌ నటుడి సినిమా!

బాలయ్య ప్రస్తుతం కొల్లి బాబీతో ఎన్బీకే 109 సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత బాలయ్య నుంచి మరో క్రేజీ కాంబోలో సినిమా రాబోతున్నట్లు సమాచారం. బాలయ్య మాస్‌ యాక్షన్‌ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. దీంతో క్రేజీ కాంబో అనే సరికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే మళయాళ స్టార్‌ నటుడు , దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారణ్‌ రీసెంట్‌ గా చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌  అవుతున్నాయి. బాలయ్య ఇమేజ్‌ ని దృష్టిలో పెట్టుకుని మళయాళ సినిమా స్టైల్‌ లో ఓ ప్రాపర్ సహజమైన సినిమా చేయాలని అనుకుంటున్నట్లు పృథ్వీ తెలిపారు.

ఈ విషయం గురించి ఆల్రెడీ ఆయనతో చర్చించిననట్లు పృథ్వీ రాజ్‌ తెలిపారు. పృథ్వీరాజ్‌ తెలుగు ప్రేక్షకులకి సలార్‌ సినిమాతో టాలీవుడ్‌ ఆడియెన్స్ కి దగ్గరైన విషయం తెలిసిందే. పృథ్వీ ప్రస్తుతం గోట్ లైఫ్‌ ఆడు జీవితం అనే సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్‌ లో విడుదల కాబోతున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories