సైలెంట్‌ గా పెళ్లి పీటలు ఎక్కేసిన హీరో!

బాయ్స్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బొమ్మరిల్లు సిద్దార్థ్‌ అంటేనే అందరూ గుర్తుపడతారు. సిద్దార్థ్‌ తెలుగు, తమిళ చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. రీసెంట్‌ గా చిన్నా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అది మంచి సక్సెస్‌ అని అందుకుంది. అలాగే ప్రేమికుల రోజు సందర్భంగా ఓయ్‌ రీ రిలీజ్‌ చేస్తే అది కూడా సూపర్‌ హిట్‌ అయ్యింది.

అయితే చాలా కాలంగా సిద్దార్థ్‌ కి తెలుగులో సినిమాలు లెవనే చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్తతో సిద్దార్థ్‌ వార్తల్లోకి ఎక్కాడు. చాలా కాలం నుంచి హీరోయిన్‌ అదితి రావుతో సిద్దార్థ్‌ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరు పెళ్లి చేసుకున్నారు అనే వార్త అటు ఆయన అభిమానులను తెలుగు ప్రేక్షకులను ఒకింత షాక్‌ కి గురి చేస్తుంది.

తాజా సమాచారం ప్రకారం సిద్దార్థ్‌, అదితిరావులు వనపర్తి జిల్లా శ్రీరంగపూర్‌ రంగనాథ స్వామి ఆలయంలో కేవలం కుటుంబీకుల సమక్షంలో వివాహం చేసేసుకున్నారు అని టాక్ వినిపిస్తుంది.  చాలా కాలం నుంచి వీరి పై వస్తున్న వదంతులకు చెక్‌ పెట్టి వీరు ఒక్కటయ్యారనే చెప్పాలి. మరి దీని గురించి వీరెమన్నా అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories