గ్లోబల్ స్టార్ రామ్ చరన్ పుట్టిన రోజు సందర్బంగా బుధవారం తెల్లవారుజామున ఆయన భార్య ఉపాసన, కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. చరణ్ దంపతులు కుమార్తెతో కలిసి మంగళవారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్నారు. చరణ్ తిరుమలకు వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు.
మంగళవారం సాయంత్రం నుంచే తిరుమలకు భారీ ఎత్తున మెగా అభిమానులు చేరుకున్నారు. దర్శనం అయిన తరువాత చరణ్ దంపతులకు టీటీడీ అధికారులు ప్రసాదాలు అందించారు. అయితే ఇక్కడ ఇంకో విశేషం కూడా చోటు చేసుకుంది. అది ఏంటంటే.. చరణ్ దంపతులు గతేడాది తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి మెగా వారసురాలిని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఆసక్తికి ఇప్పుడు తెరపడింది. ఎందుకంటే… తిరుమల స్వామి వారి సాక్షిగా క్లీంకార ఫేస్ అభిమానులకు కనిపించింది. ఉపాసన చేతిలో ఉన్న పాప ముఖం అనుకోకుండా కనిపించడంతో మీడియా ఫోటోలు తీసింది.
అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అచ్చం చరణ్ పోలికలతోనే క్లీంకార ఉంది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.