అభిమానులతో కలిసి స్టెప్పులేసిన ఫ్యామిలీ స్టార్‌ బృందం!

పరుశురామ్‌ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ , మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్‌. ఈ చిత్రం ఏప్రిల్‌ 5 న థియేటర్లలో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్‌ కూడా షూరు చేసింది. విజయ్‌ పరుశురామ్‌ కాంబో ఎలా ఉంటుందో గీత గోవిందం సినిమాతోనే చూశాం.

ఇప్పటికే సినిమా నుంచి 3 పాటలు విడుదలై ప్రేక్షకులనోట్లో నానుతున్నాయి. మూడింటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడో పాటగా విడుదైన మధురము కదా లిరికల్‌ వీడియోను హోళీ సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌ ను హోళీ సందర్భంగా చిత్ర బృందం ప్రమోట్‌ చేస్తూ అభిమానులతో కలిసి హోళీ వేడుకలు జరుపుకున్నారు.

పాటకు స్టెప్పులేస్తూ విజయ్‌, మృణాల్‌ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది. మార్చి 28న మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు మూవీ మేకర్స్‌ ప్రకటించాయి. ఈ సినిమాకు గోపి సుందర్‌ సంగీతం వహిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories