క్షణం తీరిక లేకుండా లోకనాయకుడు!

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌ 2 సినిమాతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కాకుండా కమల్‌ మరో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ప్రభాస్ తో కల్కి, మరోటి థగ్‌ లైఫ్‌.. ఇలా మూడు సినిమాలతో కమల్‌ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్నారు.

కమల్‌ సినిమాలు ఆలస్యం అవుతున్నప్పటికీ చిత్ర మేకర్స్‌ మాత్రం ఎక్కడా కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడట్లేదు. ఇండియన్‌ 2 సినిమా షూటింగ్‌ చివరికి వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అది పూర్తి అవ్వడమే దాని సీక్వెల్ పనులు కూడా మొదలు పెట్టేందుకు సిద్దంగా ఉంది చిత్ర బృందం.

ఈ క్రమంలోనే ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. దీంతో కొన్ని రోజులు ఆగాల్సి వస్తుంది. ఎన్నికల హడావిడి అవ్వగానే మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న థగ్‌ లైఫ్‌ సినిమా చిత్రీకరణ కూడా మొదలు పెట్టేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది. తెలుగులో కల్కి 2898 ఏడీలో కమల్ అతిథి పాత్రలో మెరసినట్లు.. దానికి సంబంధించిన షూటింగ్‌ మొత్తం పూర్తయ్యిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న ఇళయరాజా బయోపిక్‌ లో కూడా కమల్‌ నటిస్తున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories