యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న సినిమా రాజాసాబ్. ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాకి కూడా లీకుల బెడద తప్పలేదు. అడపాదడపా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రభాస్ ఫోటోలు బయటకు వచ్చాయి.
అయితే తాజాగా ఈ సినిమా గురించి చిత్ర దర్శకుడు మారుతి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు. అవి ఏంటంటే.. రాజా సాబ్ సినిమా కోసం ఏకంగా 4 రోజులకి..4 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నా మొదటి సినిమా ఈ రోజుల్లో మొత్తం బడ్జెటే 30 లక్షలు. కానీ ఈ సినిమాకి 4 రోజులకి 4 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది.
ఒక వేళ ఈ సినిమా ప్రభాస్ ది కాకపోయుంటే కనుక అంత డబ్బు ఖర్చు పెట్టేవాడినే కాదు.. ఆ బడ్జెట్ తో నేను మూడు సినిమాలు తీసేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మాటతో ప్రభాస్ సినిమా బడ్జెట్ ఓ 200 కోట్ల పైనే అని తెలుస్తుంది. ఈ సినిమా కనుక హిట్ అయితే ఇక డైరెక్టర్ మారుతిని పట్టుకోవాల్సిన పని లేదు. ఈ చిత్రంలో ఇప్పటికే ముగ్గురు హీరోయినట్లు నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.కానీ చిత్రంలో ప్రభాస్ ఎన్ని క్యారెక్టర్లు అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది