ఎన్నికల సంఘం ఊరుకుంటే ప్రజాస్వామ్యం హత్యే!

రాష్ట్రంలో ఎక్కడ చూసినా భయానకమైన పరిస్థితులు నెలకొంటున్నాయి.  అధికార పార్టీకి చెందిన గూండాలు పోలీసుల సహకారంతో  విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇద్దరుని హత్య చేయడం ఒక సంచలనం.  తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తల వాహనాలను తగులపెట్టడం ఒక దుర్మార్గం.  వీటి గురించి ఎన్నికల సంఘం విచారణ పూర్తి చేసి ఇంకా చర్యలు తీసుకోక ముందే..  రాష్ట్రమంతా మరింత ఘోరంగా వైసీపీ దళాలు దాడులకు తెగబడుతున్నాయి.ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా వైసిపి పోస్టర్లు సిద్ధం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉండడాన్ని, కేవలం ఫోటో తీసి సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీదనే దాడికి తెగబడడం పరాకాష్ట.  ఎన్నికల సంఘం చురుగ్గా వ్యవహరించి నిబంధనలను మరింత కఠిన తరం చేయకపోతే,  మరింత కఠినంగా వ్యవహరించకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్య  మన కళ్ళముందే జరుగుతుందని  పలువురు అంచనా వేస్తున్నారు. 

 కడప అసెంబ్లీ అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవి,  కూతురుతో కలిసి గన్నవరం మీదుగా కారులో వెళుతుండగా సిద్ధం ఫ్లెక్సీలు వైకాపా రంగుల ముద్రలు కనిపించాయి.  వాటి మీద ఫిర్యాదు చేయడానికి ఫోన్ లో ఫోటో తీశారు.

 అంతే,  నిమిషాల వ్యవహారాన్ని గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వాహనాలలో ఆమె కారును చుట్టుముట్టారు.  కారులోంచి కదలనివ్వలేదు.  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా,  వారు వచ్చారు తప్ప ఆమె మీద దాడికి ప్రయత్నిస్తున్న వారిని గురించి పట్టించుకోకుండా నామినేషన్ కి రావాల్సిందిగా బలవంతం చేయడం ఈ ఉదంతంలో పరాకాష్ట.

 పోలీసులు అధికార పార్టీకి తప్పులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.  కనీసం ఇప్పుడు ఎన్నికల వాతావరణం వచ్చిన తర్వాత..  వ్యవహారం మొత్తం ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్ళాక కూడా పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించలేక పోతే దానిని ఎలా అర్థం చేసుకోవాలి. 

అధికార పార్టీ గూండాలు తెలుగుదేశం జనసేన నాయకులు మీద చేస్తున్న దాడులకు సంబంధించి ఆయా పోలీస్ అధికారులను ఈసీ పిలిపించి మందలించకపోతే వారి ధోరణి ఇలాగే బరితెగించిపోతుంది కదా అనేది సామాన్యులలో కలుగుతున్న సందేహం.  ఈసీ ఉపేక్షించినంత కాలం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం..  ప్రమాదపు అంచునే ఉంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories