మరో యంగ్‌ డైరెక్టర్‌ తో చైతూ సినిమా!

అక్కినేని వారసుడు నాగ చైతన్య ప్రస్తుతం చేతి నిండా ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చందు మొండేటి డైరెక్షన్‌ లో తండేల్ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబో ఇదే మొదటి సారి కాదు.. ప్రేమమ్‌, సవ్యసాచి సినిమాలు వీళ్ల లిస్ట్‌ లో ఉన్నాయి. చందు మొండేటి నిఖిల్‌ తో కార్తీకేయ సినిమా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కార్తీకేయ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌ అయిపోయాడు చందు మొండేటి.

ఇప్పుడు చేస్తున్న తండేల్‌ కూడా పాన్‌ ఇండియా లెవల్లోనే విడుదల చేస్తున్నారు. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు చైతూ చేసిన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా చైతూ తన కొత్త సినిమా కోసం మరో యంగ్‌ డైరెక్టర్‌ ని లైన్లో పెట్టాడు.

విరూపాక్ష సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్న కార్తీక్‌ దండుకి ఇండస్ట్రీలో డిమాండ్‌ బాగా పెరిగింది. రీసెంట్ చైతూతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ కథను చైతూకి కూడా వినిపించడంతో ఆయన కూడా ఈ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories