సినీ ప్రపంచంలో హీరోగా కొనసాగాలంటే అందం ఒకటే ఉంటే చాలదు.. అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి.. ఆ రెండు ఉన్న హీరో సుహాస్. మొదటి సినీ ప్రపంచంలో హీరోలకు స్నేహితునిగా నటించి ఆ తరువాత కలర్ ఫోటో అనే సినిమాతో నటుడిగా అవతారమెత్తాడు.
ఆ సినిమా హిట్ కావడంతో అతని దశ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరో అయ్యాడు. సుహాస్ హీరోగా చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. గతేడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ తో మరోసారి భారీ విజయానని తన ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో సుహాస్ టాలీవుడ్ లో అందరికంటే ఫుల్ బిజీగా ఉన్న హీరో అయిపోయాడు. ఇంకా వెదుక్కుంటూ వచ్చిన సినిమాలను సుహాస్ ఎందుకు వదులుకుంటాడు. అన్నిటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇలా చూసుకుంటే ఇప్పటికే సుహాస్ ఏడు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. మరికొద్ది రోజుల్లో విరాజ్ తో కలిసి శ్రీరంగ నీతులు అనే సినిమాతో రానున్నాడు. వచ్చే నెలలో ప్రసన్నవదనం సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు.
ఇవి కాక కేబుల్ రెడ్డి, ఆనందరావు అడ్వెంచర్స్ , గొర్రె పురాణం, ఉప్పు కప్పురంబు, జనక అయితే గనక అనే సినిమాలను చిత్రీకరిస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమాలన్ని కూడా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్నాయి.