యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలోనే సినిమాను లీకుల బెడద వెంటాడుతుంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూట్ లో జాన్వీతో ఓ పాట, కొన్ని యాక్షన్ సీన్లను తెరకెక్కించనున్నారు. గోవా బీచ్ వద్ద షూటింగ్ జరుగుతుంటే ఎవరో దూరం నుంచి వీడియో తీశారు.
ఆ వీడియోలో ఎన్టీఆర్ మాస్ లుక్ లో నల్ల పంచె, చొక్కా,గుబురు గడ్డంతో పక్కా మాస్ లా కనిపిస్తున్నాడు. సముద్రం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోని నెట్టింట్లో చూసిన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ ఇకనైన ఇలాంటి లీకులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం అక్టోబర్ 10 న విడుదల అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు.