ఆ సీనియర్‌ స్టార్‌ నటుడి పక్కన సమంత!

సౌత్‌ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌ గా వెలుగుతున్న నటి సమంత. తన అందం, నటనతో ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకుంది ఈ ముద్దగుమ్మ. ప్రస్తుతం సమంత సినిమాలకు బ్రేక్‌ ఇస్తున్న అన్న విషయం ప్రకటించింది. కానీ ఈ భామ హిందీలో వెబ్‌ సిరీస్‌ లు చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉంది. కొంతకాలం క్రితం సమంత మయోసైటిసి అనే వ్యాధి బారిన పడి కోలుకుంది.

ఈ క్రమంలోనే ఆమె సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. ట్రీట్‌ మెంట్‌ పూర్తి కావడంతో మళ్లీ నటన మీద సామ్‌ దృష్టి పెట్టింది. వ్యాధి నుంచి కోలుకున్న తరువాత సామ్‌ ముందుగా యాడ్స్‌ చేయడం నుంచి మొదలుపెట్టింది. బంగారం, ఐస్‌ క్రీములు వంటి ప్రకటనలు చేసింది. తాజాగా సమంత సీనియర్‌ నటుడు పక్కన నటించిన యాడ్‌ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ సీనియర్‌ నటుడు ఎవరో కాదు మమ్ముట్టి.

మమ్ముట్టికి ప్రస్తుతం 72 సంవత్సరాలు కొద్ది రోజుల క్రితం ఈ నటుడి పక్కన స్టార్‌ హీరోయిన్‌ జ్యోతిక నటించింది. జ్యోతిక తరువాత మమ్ముట్టి సరసన నటించే నటి ఎవరు అనే సందేహలు అందరికీ ఉన్నాయి. తాజాగా ఆయన పక్కన యాడ్ లో మెరిసే సరికి ఆయన తన సినిమాలో నటించేందుకు ఆఫర్‌ చేశాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన పక్కన నటించడానికి సమంత ఒప్పుకుంది లేదు అనే విషయం మాత్రం తెలియలేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories