ఆహా ఓహో అనిపిస్తుందనుకుంటే తుస్సుమనిపించింది. తాను పట్టిందల్లా బంగారమే అని పేరు తెచ్చుకున్న అల్లు అరవింద్‌కు ఆహా గట్టి షాకులు ఇస్తూ వచ్చింది. మొదట్లో బోల్డ్ కంటెంట్‌నే నమ్ముకోని మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆహా తర్వాత క్రమంగా మిగిలిన జానర్లపైనా దృష్టి పెట్టింది. అయితే ఏదీ వర్కౌట్ కాలేదు. మధ్యలో వచ్చిన బాలయ్య అన్స్టాపబూల్ మినహా ఆహా గురించి సినీ అభిమానుల్లో పెద్దగా చర్చకు వచ్చిన విషయాలు లేవు. దీంతో రేపో మాపో ఆహా మూతపడుతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోని, జీ నెట్వర్క్ ఆహాను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్న ప్రచారం ఓవైపు బలంగా సాగుతోంది. మొన్నామధ్య గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆహా యాప్ కనపడకుండా పోయింది. గూగుల్ మళ్లి యాప్‌ని రీస్టోర్ చేసింది. ప్రస్తుతమంతా ఆహాకు గడ్డు కాలమే నడుస్తోంది. అందుకే మళ్లీ ఓల్డ్ ఫార్ములా బోల్డ్ కంటెంట్‌నే నమ్ముకోని మార్కెట్లోకి సిరీస్‌లు, షోలు వదులుతోంది.
ఇటీవలే మిక్స్అప్ అంటూ ఓ బోల్డ్ సిరీస్‌తో ముందుకొచ్చింది ఆహా. అందులో అంతా వైల్డ్ రొమాన్సే ఉంది. ప్రేక్షకులకు సీన్‌కు తగ్గట్టుగా రొమాన్స్ చూపిస్తే బాగుంటుంది కానీ రొమాన్సే థిమ్గా చూపిస్తే వెగటు పుట్టవచ్చు. అయినా ఆహా వెనక్కి తగ్గడంలేదు. బోల్డ్ కంటెంట్‌పైనే ఫుల్‌గా ఫోకస్ చేస్తోంది. ఇటు మెగా డాటర్ నిహారికా కొణిదెలపై ఆహా ఎక్కువగా డిపెండైనట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం ‘చెఫ్ మంత్ర’ సీజన్-3 నడుస్తోంది. ఇది ప్రధానంగా వంటపై దృష్టి పెడుతుంది. ఈ షోలో సినిమా సెలబ్రిటీలను గేమ్స్, కుకింగ్ సెషన్స్ కు ఆహ్వానిస్తూంటారు. కొణిదెల నిహారిక ఈ సీజన్‌కు సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్‌కు అనుగుణంగానే నిహారిక పయనిస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఈ షో ఇప్పుడు సైడ్ ట్రాక్ అవుతోంది. ఈ పాల్గొనే సెలబ్రిటీల కోసం డిజైన్ చేసిన గేమ్ షో స్క్రిప్ట్ డబుల్ మీనింగ్స్‌తో నిండిపోతోంది. ప్రశ్నల చుట్టూ జరిగే చర్చలు అశ్లీలతతో నిండి ఉంటున్నాయి. ఫ్యామిలీ ఓరియెంటెడ్ షో అయినప్పటికీ స్క్రిప్ట్ తరచుగా పడకగదికి సంబంధించిన డార్క్ హ్యూమర్లోకి వెళ్తుండడం చూస్తుంటే ఆహా మళ్లీ బోల్డ్నే నమ్ముకుందని క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది.