ఆ వెబ్‌ సిరీస్ కోసం సామ్‌ అంత తీసుకుందా!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలు చేస్తూనే మరో పక్క వెబ్‌ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. అంత బిజీలో కూడా అభిమానులతో ఎప్పుడూ సోషల్‌ మీడియాలో టచ్ లోనే ఉంటుంది. తెలుగు మాత్రమే కాకుండా, తమిళంలో కూడా క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌ గా పేరు తెచ్చుకుంది.

గత కొంతకాలంగా స్టార్‌ హీరోయిన్‌ హోదా అనుభవిస్తున్న సామ్‌ గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక బ్రేక్‌ తీసుకుంది. అక్కినేని ఇంటి కోడలిగా విడిపోయిన తరువాత ఆమె మయోసైటిస్‌ అనే వ్యాధి బారిన పడి కోలుకుంటున్నట్లు తెలిపింది. దీంతో ఆమె చాలా కాలంగా రెస్ట్‌ లోనే ఉంది.

ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు చేయడానికి సైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె బాలీవుడ్‌ నటుడితో కలిసి సిటాడెల్‌ అనే వెబ్‌ సిరీస్‌ లో నటించింది. ఇప్పటికే ఈ వెబ్‌ సిరీస్‌ కు సంబంధించిన షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రాజ్‌ అండ్‌ డీకే డైరెక్ట్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ వెబ్‌ సిరీస్‌ లో నటించినందుకు గానూ సామ్‌ తీసుకున్న రెమ్యూనరేషన్‌ గురించి ఓ షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం సమంతకి 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఆమెకు ఫ్యామిలీ మ్యాన్‌ 2 సిరీస్‌ లో వచ్చిన క్రేజ్‌ తో పాటు పాన్‌ ఇండియాలో ఉన్న గుర్తింపు వల్ల ఆమె ఎంత డిమాండ్‌ చేస్తే అంత ఇవ్వడానికి మేకర్స్‌ సిద్దమైనట్లు సమాచారం.

ప్రస్తుతానికి సమంత ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదు. కానీ త్వరలోనే ప్రాజెక్టులు ఫైనల్‌ చేసి తరువాత అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories