మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అ ఆ సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే కుర్రకారు ని తన అందంతో మెస్మరైజ్ చేసింది. ఆ తరువాత వరుస హిట్లతో మంచి బ్రేక్ అందుకుంది. కెరీర్ తొలినాళ్లలో పద్దతైన పాత్రల్లో నటించిన అనుపమ.. ఆ తరువాత గ్లామర్ డోస్ పెంచి కుర్రకార్రుని నిద్ర పోకుండా చేసింది.
తాజాగా అనుపమ సిద్దు జొన్నలగడ్డ హీరోగా టిల్లు స్క్వేర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో అనుపమ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అనుపమ తన తమ్ముడికి బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.
అక్కడి వరకు బాగానే ఉంది. హ్యాపీ బర్త్ డే చెబితే పోస్ట్ ఎందుకు వైరల్ అవుతుంది అనుకుంటున్నారా..ఉంగరాల జుట్టు అమ్మడు అంటే ఎంతో మందికి క్రష్ మరి. చాలా మంది అభిమానులు దొండకాయ్.. బెండకాయ్..అనుపమ నా గుండెకాయ్ అంటూ సరదాగా కామెంట్లు పెట్టే విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా అనుపమ తన తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా విషెస్ పెడితే.. హ్యాపీ బర్త్ డే బామ్మర్ది , మీ అక్కను బాగా చూసుకోరా బామ్మర్ది ..అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. దీంతో అనుపమ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.