కంగువా నుంచి అదిరిపోయే అప్డేట్‌..ప్రకటించిన చిత్ర బృందం!

తమిళ స్టార్ నటుడు సూర్య, డైరెక్టర్‌ శివ కాంబినేషనల్‌ వస్తున్న భారీ చిత్రం కంగువా. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌ తో యూవీ క్రియేషన్స్‌ తెరకెక్కిస్తుంది.  వినూత్నమైన పీరియాడిక్‌ యాక్షన్‌ సినిమాగా ఈ చిత్రం రూపు దిద్దుకుంటుంది. ఈ చిత్రంలో నటుడు సూర్య రకరకాల వేషాల్లో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటున్న ఈ సినిమాని రెండు పార్ట్‌ లుగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్‌ 1 ని ఈ ఏడాది విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ ను  మూవీ మేకర్స్‌ తాజాగా సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

కంగువా టీజర్‌ ను మార్చి 19 న సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మంగళవారం సాయంత్రం టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నట్లు స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది.మంగళవారం సాయంత్రం టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

‘సిద్ధంగా ఉండండి. మీ వ్యక్తిగత స్క్రీన్‌లను మండించడానికి కంగువ వస్తోంది. రేపు సాయంత్రం 4:30 గంటలకు టీజర్ విడుదల కానుంది’ అంటూ మూవీ మేకర్స్‌ ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ కు మంచి ఆదరణ లభించింది.  ఈ సినిమాని సుమారు 350 కోట్లతో తెరకెక్కుతుంది.

కగ అనే పరాక్రముడి కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో సూర్య ఆరు క్యారెక్టర్స్‌ చేయబోతున్నట్లు సమాచారం. బాబీ దేవోల్‌ విలన్‌ గా నటిస్తుండగా.. దిశా పటానీ కథానాయికగా నటిస్తున్నారు. జగపతి బాబు, యోగిబాబు కోవై సరళ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని పాన్‌ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే 10 భాషల్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్దమవుతుంది. ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతాన్ని అందిస్తున్నారు.  

Related Posts

Comments

spot_img

Recent Stories