బన్నీ బర్త్‌ డే రోజున అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌!

అల్లు అర్జున్‌ పుట్టిన రోజు వేడుకలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. పాన్‌ ఇండియా లెవల్లో అల్లు అర్జున్‌ కి ఫ్యాన్స్‌ ని ఏర్పరించింది.

ఈ క్రమంలోనే ఎన్నో సంవత్సరాల తెలుగు చిత్ర పరిశ్రమ కల అయినటువంటి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ ని నిలబెట్టింది. పుష్ప సినిమాలోనే పుష్ప 2 కూడా రాబోతుందని చిత్ర బృందం ప్రకటించింది. ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ కూడా చాలా వేగంగా జరుగుతుంది.

సినిమా ప్రకటించిన తరువాత దీనికి సంబంధించిన ఒకే ఒక్క టీజర్‌ బయటకు వచ్చింది. అందులో అల్లు అర్జున్‌ ని చూసిన ఫ్యాన్స్‌ పిచ్చిగా సంతోషించారు. అప్పటి నుంచి సినిమా నుంచి ఒక్క పోస్టర్‌ కూడా బయటకు రాలేదు. దాంతో సినిమా నుంచి ఏదైనా అప్డేట్‌ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి బన్నీ బర్త్‌ డే రోజున అదిరిపోయే అప్డేట్‌ రాబోతున్నట్లు మూవీ మేకర్స్‌ ప్రకటించారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది. పుష్ప సినిమా కు దేవీ శ్రీ ప్రసాదం సంగీతం అందించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 కి కూడా డీఎస్పీ నే సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.

అయితే చిత్రం బృందం పాటను విడుదల చేస్తారా.. లేక పాటకు సంబంధించిన పోస్టర్‌ ను విడుదల చేస్తారా అనే దాని మీద క్లారిటీ లేదు. పుష్ప 2 సినిమా ఆగస్టు 15 న పాన్‌ ఇండియా లెవల్లో విడుదల అవ్వబోతుందని చిత్ర బృందం ప్రకటించింది.

Related Posts

Comments

spot_img

Recent Stories