మళ్లీ మొదలైన సరిపోదా శనివారం షూటింగ్‌!

నేచురల్‌ స్టార్‌ నాని ,దర్శకుడు వివేక్‌ ఆత్రేయ మరోసారి కలిసి చేస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో అంటే సుందరానికి అనే సినిమా చేసి హిట్‌ కొట్టారు. ఆ సినిమాలో నాని క్లాస్‌ పాత్రలో కనిపించగా..ఈ సినిమాలో ఇంతకు ముందు ఏ సినిమాలో లేని క్యారెక్టర్‌ ను నాని చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ కొద్ది రోజుల ముందే విడుదల చేయగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ మళ్లీ మార్చి 18 నుంచి మొదలు పెట్టానున్నట్లు సమాచారం.

ఈ షూటింగ్‌ లో నానితో పాటు మరికొంత మంది నటీనటులు కూడా పాల్గొనేలా చిత్ర బృందం సిద్దం అవుతుంది. ఈసారి షెడ్యూల్‌ లో యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సన్నివేశాలే  ఈ సినిమాకి ముఖ్యమని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్‌ మోహన్‌ నాని సరసన నటిస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories