ఉస్తాద్‌ నుంచి అదిరిపోయే అప్ డేట్ ఎప్పుడంటే!

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఉస్తాద్‌ భగత్ సింగ్‌ ఒకటి. ఈ సినిమాకు స్టార్‌ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మొదలై రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. పవన్‌ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల సినిమా చిత్రీకరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది.

ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏపీ ఎన్నికలు సమయం కావడంతో వాయిదా చిత్రం వాయిదా పడింది. ఇక ఈ సినిమా నుంచి అప్‌డేట్‌ లేక చాలా రోజుల నుంచి అభిమానులు వెయిట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫ్యాన్స్‌ కు చిత్ర బృందం ఓ గుడ్‌ న్యూస్ చెప్పింది.

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నుంచి మీరు ఊహించని అప్‌డేట్‌ రానుందంటూ మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ ప్రకటించింది. అయితే ఆ అప్‌డేట్ ఏంటని, దానిని ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మాత్రం తెలపలేదు. ఇక ఈ సినిమా నుంచి అప్‌డేట్‌ వస్తుంది అనడంతో పవర్‌ స్టార్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories