ఈసారి కూడా కల్కి వాయిదానా..ఈ సారి ఏం అడ్డంకి అంటే!

విఘ్నేశ్వరుడి పెళ్లికి అన్ని విఘ్నాలే అన్నట్లు ప్రభాస్‌ కల్కి సినిమా విడుదలవుతుంది అనుకుంటున్న సమయంలో ఏదోక అడ్డంకి వచ్చి విడుదల వాయిదా పడుతుంది. కల్కి 2898 ఏడీ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన కథానాయికగా దీపికా పదుకొణె నటిస్తుంది.  ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ లాంటి దిగ్గజ తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీతో స్పెషల్‌ సాంగ్‌ కూడా సందడి చేయనుంది. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అశ్విని దత్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. మే 9 న ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది.

కానీ ఇప్పుడు ఈ చిత్రం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో సినిమాను మరోసారి వాయిదా అవకాశలు కనిపిస్తున్నాయి. మే 13న రెండు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రిలీజ్‌ విషయం కొంచెం అనుమానంగానే ఉంది.

ఈ మూవీలో నటిస్తున్న అమితాబ్‌ సినిమా గురించి తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. నా షూటింగ్‌ ముగించుకుని ఇప్పుడే వచ్చాను. కల్కి షూటింగ్‌ ఇప్పుడే పూర్తయ్యింది. సినిమాని మే 9 న విడుదల కానుందని చెప్పుకొచ్చారు. మరి ప్రభాస్‌ కల్కి సినిమా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా ఎప్పుడూ విడుదల అవుతుందో చెప్పలేని అయోమయ స్థితి ఏర్పడింది.

Related Posts

Comments

spot_img

Recent Stories