ఇది కదా మాకు కావాల్సిన స్టఫ్‌!

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ..ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటునే మరోపక్క సినిమాలు కూడా చేస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఈ క్రమంలోనే జనసేన అధినేతగా అభ్యర్థులను ఫైనల్‌ చేసే పనిలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు పవన్‌.

ఎలక్షన్ల హడావిడి అవుతుండగానే.. పవన్‌ సినిమాలకు సంబంధించిన వార్తలు కూడా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ఓజీ సినిమా నుంచి విడుదల చేసిన ఓ పోస్టర్‌ పవన్‌ ఫ్యాన్స్‌ కు పూనకాలు తెప్పిస్తుంది. ఎందుకంటే ఆ పోస్టర్‌ లో పవన్‌ చేతిలో కత్తితో విలన్స్‌ ని తెగ నరుకుతూ , రక్తంతో తడిచిన బట్టలతో కనిపిస్తున్నాడు.

ఇలాంటి స్టఫ్‌ కదా మనకు కావాల్సింది అంటూ తెగ సంబరిపడిపోతున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్‌ నెలలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రణాళికలు వేస్తుంది. ఇప్పటికే ఈ సినిమాని చిత్ర బృందం 70 శాతానికి పైగా షూటింగ్‌ కూడా కంప్లీట్‌ చేసుకుంది. ఈ సినిమాకు సుజిత్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు.

ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ కి జంటగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌  చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి , శ్రియ రెడ్డి కీలక పాత్రలు చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories