టాలీవుడ్ లో బాలయ్య బాబు రేంజే వేరు. ఎంతటి హీరో అయినా సరే జై బాలయ్య అని ఏదోక సందర్భంలో అనాల్సిందే. గత కొంత కాలంగా బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య హవా నడుస్తోంది. ఏ సందర్భంలోనైనా సరే జై బాలయ్య అనే పదాన్ని తెగ వాడేస్తున్నారు. నిజానికి హైదరాబాద్ లోనే కాదు బెంగుళూరు, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో బాలకృష్ణ పాటలు ప్లే చేస్తూ బాలయ్య నినాదాలు కొట్టడం సర్వసాధారణం అయిపోయింది.
ఇతర హీరోల సినిమాలకు వెళ్లి కూడా చాలా మంది జై బాలయ్య నినాదాలు చేయడం కూడా కామన్ గా మారిపోయింది. ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. తమిళ్ లో ఓ సినిమాలో కమెడియన్ యోగిబాబు కూడా జై బాలయ్య అన్నాడు. థూకుదురై అనే సినిమాలో
యోగిబాబు ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫుల్ హారర్ కామెడీ సినిమా.
ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి మూడు నెలలు అవుతుంది. తాజాగా ఓటీటీలోకి వచ్చింది. అసలు ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే.. ఆ సినిమాలో యోగి బాబు ఓ సారి మాయం అవ్వడానికి జై బాలయ్య అంటాడు. ఆ వెంటనే మాయం అయిపోతాడు. దీంతో తెలుగు ప్రేక్షకుల దృష్టి ఈ సినిమా పై పడింది.
దీంతో అక్కడ కూడా బాలయ్య బాబు డామినేషనే అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.