ఏం ఉన్నాడురా బాబు..వైరల్ అవుతున్న చరణ్‌ లుక్‌!

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌, దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం గేమ్‌ ఛేంజర్. ఈ మూవీ షూటింగ్‌ ను త్వరగా పూర్తి చేసేంఉదకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. డైరెక్టర్‌ శంకర్‌ కమల్‌ హాసన్‌ తో భారతీయుడు 2 కూడా చూస్తూ ఫుల్‌ బిజీగా ఉండడంతో చరణ్‌ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే చరణ్‌ మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

అయితే తాజాగా గేమ్‌ ఛేంజర్‌ సినిమాలోని ఓ లుక్‌ బయటకు వచ్చింది. అది సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ సినిమాకు స్టార్‌ డైరక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ కథని అందిస్తుండడంతో , శంకర్‌ తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను నిజ జీవనంలో సమాజంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రకటించి మూడేళ్లు దాటిపోయింది. కానీ ఇంకా షూటింగ్‌ జరుపుకుంటూనే ఉంది. మూడేళ్లు గడుస్తున్నప్పటికీ చిత్రం నుంచి ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వకుండా అంతా సస్పెన్స్ గానే ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే అడపాదడపా సినిమా నుంచి లీక్ అవుతున్న సీన్లతోనే అభిమానులు సరిపెట్టుకుంటున్నారు.

తాజాగా మరోసారి ఈ సినిమా నుంచి ఓ వీడియో లీక్‌ అయ్యింది. వైజాగ్‌ గేమ్‌ ఛేంజర్‌ సినిమా సెట్స్‌ నుంచి చరణ్‌ ఫోటోలు లీక్‌ అయ్యాయి. అందులో రామ్‌ చరణ్‌ లుక్‌ కొత్తగా ఉంది. పూర్తిగా క్లీన్ షేవ్‌, మీసం తో చరణ్‌ చూడటానికి క్లాస్‌ లుక్‌ లో అదిరిపోయాడు. కళ్ల జోడు పెట్టుకుని సూపర్‌ ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి.ఈ చిత్రంలో రామ్‌ చరన్‌ సరసన కియార అద్వాణీ, నటి అంజలి, దర్శకుడు ఎస్‍జే సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories