తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని తమిళ నటి ” గురు” సినిమా ఫేమ్ రితికా సింగ్ చెప్పుకొచ్చింది. రితికా ప్రస్తుతం రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెట్టయాన్ చిత్రంలో నటిస్తుంది. తెలుగులో వేటగాడు గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకు జైభీమ్ ఫేమ్ టీజే జ్ఙానవేల్ డైరెక్షన్ వహిస్తున్నాడు.
ఈ చిత్రంలో రితికా సింగ్ ఓ ముఖ్యమైన పాత్ర లో నటిస్తుంది. సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో రితికా రజినీ కాంత్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. రజినీకి ఉన్న దయాగుణం, ప్రేమ సాటిలేనివని చెప్పుకొచ్చింది. అంతటి గొప్ప వ్యక్తితో కలిసి తాను నటించడం అంటే మాటలు కాదు అంటూ భావోద్వేగానికి గురైంది.
ఇలాంటి అవకాశం నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు రితికా చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ సినిమా 75 శాతం పూర్తి చేసుకుంది. తాజా షూటింగ్ ని హైదరాబాద్ లో ప్రారంభించారు. దీని కోసం రజినీకాంత్ కూడా చెన్నై నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్ , రానా,మంజు వారియర్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.