మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే చరణ్ ఉప్పెన దర్శకుడు , జాతీయ అవార్డు దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ఆర్సీ 16 చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ సినిమా శ్రీకాకుళం యాస, భాషలతో రూపుదిద్దుకోబోతుందని ఆడిషన్ కాల్ కూడా ఇచ్చారు.
ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు బోనీ కపూర్ తెలియజేశారు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో పీరియాడికల్ జోనర్ లో ఈ సినిమా ఉండనున్నట్లు బుచ్చిబాబు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలు కాబోతుందా అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు.
ఈ నెల 20 నుంచి ఆర్సీ 16 షూటింగ్ ను మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చెర్రీ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడని చిత్ర బృందం నుంచి వెలువడిన సమాచారం. అయితే ఇదంతా బానే ఉన్నప్పటికీ సినిమా టైటిల్ గురించి చాలా కాలం నుంచి చర్చ జరుగుతుంది. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఖరారు చేసే పనిలో చిత్ర బృందం తెలిపింది.
రంగస్థలం సినిమా తరువాత రామ్ చరణ్ నటిస్తున్న గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా ఆర్సీ 16. ఉత్తరాంధ్ర సైడ్ పెద్ది అంటే పెద్ద అని మీనింగ్.ఇప్పటికీ కూడా చాలా మంది ముసలివారిని, పెద్దవారిని పెద్ది అని పిలుస్తూ ఉంటారు. కథ కూడా అలానే ఉండడంతో ఆ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. బుచ్చిబాబు-రామ్ చరణ్ కాంబో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.