ఆ హీరో కోసం స్క్రిప్టులో మార్పులు

తేజా సజ్జా.. ఓ బేబీ సినిమా తరువాత అతని స్థాయి పెరిగింది. తరువాత వచ్చిన జాంబీ రెడ్డి సినిమాతో పేరు తెచ్చుకుని హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత హనుమాన్‌ సినిమా సూపర్‌ డూపర్ హిట్‌ అవ్వడంతో పాన్‌ ఇండియా స్టార్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో తనకు వచ్చిన క్రేజ్‌ ను కాపాడుకోవడానికి తేజా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

ప్రస్తుతం తేజా చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తేజా సజ్జా హనుమాన్‌ 2, మిరాయ్‌ సినిమాలున్నాయి. ఈ సినిమాల్లో
మిరాయ్‌ సినిమాను హనుమాన్‌ 2 కంటే ముందే తేజా ఒప్పుకున్నాడు. ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్‌ కూడా సగానికి పైగా అయిపోయింది.

ఈ సినిమాలో మంచు మనోజ్‌ ప్రతినాయకుని పాత్రలో కనిపిస్తున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో తెలిపింది. అంతేకాకుండా దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఇందులో తేజ పాత్ర చిన్నగా ఉండేది.. హనుమాన్‌ సినిమాతో తేజాకి పాన్‌ ఇండియా లెవల్లో గుర్తింపు రావడంతో అతని పాత్రను మరింత పెంచేందుకు చిత్ర బృందం కథలో మార్పులు చేర్పులు చేసింది.

గోవాలో మిరాయ్‌ స్క్రిప్ట్‌ ను మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే షూట్‌ చేసిన సీన్లను కూడా రీ షూట్‌ చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యిందంట.

Related Posts

Comments

spot_img

Recent Stories