టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ స్టార్ నటుడు ధనుష్, జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తో కలిసి కుబేర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ధనుష్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ విశేషమైన స్పందన వచ్చింది. దీంతో సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి.
ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నాడని ముందు నుంచి చిత్ర బృందం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఆయనకు సంబంధించిన ఏ విషయం బయటకు రాకపోవడంతో..అసలు ఆయన ఈ సినిమాలో ఉన్నారా లేదా అనే సందేహలు కూడా చాలా మందిలో కలిగాయి.
వాటన్నటికి సమాధానం చెబుతూ చిత్ర బృందం నాగ్ తో శేఖర్ కమ్ముల ఉన్న ఓ చిత్రాన్ని విడుదల చేసింది. బ్యాంకాక్ లో షూటింగ్ జరుగుతున్నట్లుగా చిత్రాన్ని చూస్తే తెలుస్తుంది. నాగార్జునతో పాటు మరి కొంత మంది నటులు కూడా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. అక్కడ షెడ్యూల్ ప్రకారం కొన్ని టాకీ, యాక్షన్ పార్ట్ లను చిత్రీకరించనున్నారని సమాచారం.
అయితే ఈ సినిమాలో నాగార్జున నెగిటివ్ రోల్ అంటూ ప్రచారం సాగుతోంది. ధనుష్ ఓ మాఫియా డాన్ గా నటిస్తుండగా… ఆయన్ని వెంటాడే ఈడీ అధికారి పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఆయనకు కొంచెం ప్రతినాయక ఛాయలు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ చూసిన వారికి అది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని కూడా ఎవరికీ అనిపించదు.
ఈ సినిమాతో క్లాసిక్ మూవీ డైరెక్టర్ అని పేరున్న శేఖర్ కమ్ముల… యాక్షన్ డైరెక్టర్ గా మారినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని కొన్ని అద్బుతమైన లోకేషన్స్ లో చిత్రీకరిస్తున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల, నాగార్జున మాట్లాడుకుంటున్న ఓ చిత్రాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో రష్మిక నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.