తమిళ్ ఇండస్ట్రీకి “96”, “సత్యం సుందరం” వంటి భావోద్వేగభరితమైన చిత్రాలు అందించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ సి మరోసారి కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన సినిమాలంటే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడతాయి. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగువారికీ ఆయన సినిమాలంటే మంచి ఆసక్తి ఉంటుంది.
మొదట ఈ కొత్త సినిమాను విక్రమ్‌తో చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఫహద్ ఫాసిల్‌ను హీరోగా ఫైనల్ చేసినట్టు కోలీవుడ్ టాక్. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాలో కూడా దర్శకుడు తన స్టైల్‌లో ఎమోషనల్ టచ్‌ను జోడించబోతున్నాడని సమాచారం.
45 నిమిషాల నరేషన్ విన్న ఫహద్ వెంటనే ఒప్పుకున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళంలో ఇప్పటి వరకు ఫహద్ చేసిన సినిమాలు ఎక్కువగా మల్టీ స్టారర్స్ లేదా ప్రత్యేకమైన పాత్రలే కావడంతో, ఈ సినిమా ఆయనకు మొదటి సోలో హిట్‌గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.