యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న సెన్సేషనల్ సినిమా దేవర. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. అయితే, ఈ సినిమా విషయంలో మేకర్స్ 9 సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారనే టాక్ ప్రస్తుతం జోరుగా వినపడుతుంది. తారక్ లక్కీ నెంబర్ 9 అని అందరికీ తెలిసిందే. అందుకే ఆయనకు సంబంధించిన కార్లు అన్నింటికీ 9999 నెంబర్ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే.
ఇక దేవర సినిమా విషయంలోనూ 9 సంఖ్య మనకు కనిపించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌ను సెప్టెంబర్‌కి మార్చారు. ఇది క్యాలెండర్‌లో 9వ నెల కావడం విశేషం. అలాగే, రిలీజ్ డేట్‌ని 27గా నిర్ణయించారు. 2+7 కలిపితే 9 వస్తుంది. అంతేగాక, ఈ సినిమాను ప్రీమియర్ షోలుగా అర్థరాత్రి 1.08 గంటలకు వేయాలని మేకర్స్ చూస్తున్నారు. 1+8 కలిపితే కూడా 9 వస్తోంది.
ఇలా ఎటు చూసినా 9 సంఖ్యాబలం ఉండేలా దేవర మేకర్స్ ప్లాన్ చేస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే 9 ‘దేవర’ సక్సెస్‌కి కలిసొస్తుందా అని కామన్ ఆడియెన్స్ అనుకుంటున్నారు.