జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకువచ్చి ప్రభుత్వాన్ని నడిపించారు. ఉద్యోగుల జీతాలకు కూడా ప్రతినెలా అప్పులు చేసే పరిస్థితి. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల జేబుల్లో డబ్బులు పెడుతూ పోతేచాలు.. తనకు జీవితపర్యంతమూ ఓట్లు వేసి గెలిపిస్తూ ఉంటానే భ్రమలో ఆయన బతికారు. అందుకోసం ఆయన నెలనెలా వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తూ నెట్టుకొచ్చారు. కేంద్రం నుంచి వివిధ పథకాలకు డబ్బు వచ్చినా కూడా సమస్తం ఈపథకాలకు తగలేస్తూ వచ్చారు. అభివృద్ధి పథకాల గురించిచ అసలు అయిదేళ్ల కాలంలో ఏమాత్రం పట్టించుకోలేదు. ఇలా ప్రభుత్వాన్ని నడిపిన జగన్.. 5 వేల కోట్ల రూపాయల రుణాన్ని మాత్రం మంజూరైనా కూడా తీసుకోలేదు. ఆ అప్పు ప్రభుత్వం తీసుకోకుండానే మురిగిపోయింది. ఐదు వేల కోట్ల రూపాయల అప్పు మంజూరైతే తీసుకోకుండా జగన్ ఎందుకు వదిలేశారు. ఎవరికైనా ఈ సందేహం వస్తంది.
ఎందుకంటే అది చంద్రబాబునాయుడు తన ప్రయత్నమ్మీద మంజూరు చేయించిన అప్పు. ఆయన తొలివిడత అధికారంలో ఉన్న రోజుల్లో పట్టణాల అభివృద్ధికి బ్యాంకుల నుంచి ఆమేరకు అప్పు మంజూరు చేయించారు. ఆ నిధులను కేవలం పట్టణాల అభివృద్ధి పనులకు మాత్రమే ఖర్చు పెట్టాలి. కానీ అలాంటి పనులంటే జగన్మోహన్ రెడ్డికి కిట్టదు కదా. ఆయన ఒక్క పని కూడా చేయడానికి ఇష్టపడలేదు. ఒక్కరూపాయి కూడా తీసుకోనేలేదు. అది కాస్తా 2024లో రద్దయింది.
మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ప్రధాని మోడీతో ప్రత్యేకంగా మాట్లాడి.. తిరిగి రుణం మంజూరు చేయించారు. దీంతో ఆ నిధుల మేరకు ప ట్టణాల్లో అభివృద్ధి పనులు ఈ అయిదేళ్లలో జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు హయాంలో మొదలై.. జగన్ దురాలోచన వల్ల అసంపూర్తిగా మిగిలిపోయిన పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.