35 కుటుంబాన్ని పరిచయం చేసిన నివేదా!

యంగ్ బ్యూటీ నివేదా థామస్‌ ఇటీవల తాను చేసే సినిమాలను చాలా సెలెక్టివ్‌ గా చేస్తుందన్న విషయం తెలిసిందే. నివేదా కొంచెం గ్యాప్‌ తరువాత చేస్తున్న సినిమా 35- చిన్న కథ కాదు…అనేది క్యాప్షన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా విడుదలకు  రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను తాజాగా విడుదల చేశారు.

”ఇదో, మా సిన్న కుటుంబం తొలి సూపు” అంటూ ఈ మూవీలోని మెయిన్ క్యాస్టింగ్ ఉన్న పోస్ట‌ర్ ను విడుదల చేశారు. ఇందులో నివేదా థామ‌స్ ఓ మ‌ధ్య త‌ర‌గతి గృహిణి పాత్ర‌లో అలరించబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ ను బుధవార సాయంత్రం 6 గంట‌లకు విడుదల చేశారు. 

ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి, విశ్వ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను రానా ద‌గ్గుబాటి ప్రొడ్యూస్ చేస్తుండ‌గా, వివేక్ సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. నందకిషోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆగ‌స్టు 15న విడుదల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories