ఆ ఒక్క సీన్ సీజీ కోసం 12 కోట్లు!?

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ బింబిసార ఫేమ్‌ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ సినిమా “విశ్వంభర” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం మెగా అభిమానులు అనౌన్స్ చేసిన నాటి నుంచే ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

అయితే చాలా కాలం తర్వాత చిరు నుంచి ఒక భారీ సినిమా అది కూడా ఫాంటసీ జానర్ లో వస్తున్నా సినిమా కావడంతో అంచనాలు గట్టిగా నెలకొన్నాయి. గతంలో వచ్చిన తన చిత్రాలు అంజి, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటివి ఎలాంటి మ్యాజిక్ ని చేశాయో అందరికీ తెలిసిన విషయమే. అందుకే విశ్వంభర పై కూడా అనేక అంచనాలు సెట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో విజువల్స్ కూడా ఆ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.

ఇలా విశ్వంభర లో కేవలం ఒక్క సీక్వెన్స్ కోసమే మేకర్స్ 12 కోట్లు పెడుతున్నట్టుగా ఇపుడు టాక్‌ వినిపిస్తుంది. అది కూడా కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసమే 12 కోట్లు పెడుతున్నారని సమాచారం. సినిమాలో ఒక సాలిడ్ ఎపిసోడ్ ఉండగా అందులో భారీ విజువల్స్ అవసరం పడుతుందట. అందుకే ఇందులో కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే మేకర్స్ ఏకంగా 12 కోట్లు వెచ్చిస్తున్నారు అని సమాచారం. మరి విశ్వంభర లో ఆ సీన్ ఎలా ఉంటుందో థియేటర్లలో చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories