విజయ్ దేవరకొండ కోసం యానిమల్ హీరో! టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12 కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫార్మె్న్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చిత్ర యూనిట్ ఈ మూవీపై అంచనాలను పెంచేస్తుంది. కాగా, ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
VD12 చిత్ర టైటిల్ టీజర్‌ను తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ టైటిల్ టీజర్‌కు పలువురు స్టార్ హీరోలు తమ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే తమిళ టీజర్‌కు స్టార్ హీరో సూర్య వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇక ఇప్పుడు ఈ చిత్ర హిందీ టైటిల్ టీజర్‌కు ‘యానిమల్’ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తన వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ టీజర్‌కు రణ్‌బీర్ వాయిస్ ఓవర్‌తో ఇది మరింత వైల్డ్‌గా మారిందని.. ప్రేక్షకులకు ఇది పర్ఫెక్ట్ ట్రీట్‌గా మారనుందని వారు తెలిపారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ టైటిల్ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.