దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టి.. సూపర్ స్టార్ మహేశ్ సరసన పోకిరిలో నటించి కుర్రకారు గుండెల్ని పిండేసిన గోవా భామ ఇలియానా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన అందం, నటనతో స్టార్ హీరోల పక్కన ఓ వెలుగు వెలిగింది. ఈ భామ నటించిన చాలా చిత్రాలు సూపర్ హిట్ కూడా అయ్యాయి. అయితే తరువాత ఈ ముద్దుగుమ్మ తెలుగు పరిశ్రమకు దూరం అయ్యింది.
ఈ క్రమంలోనే గతేడాది ఈ భామ ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె గర్భం ధరించిన విషయాన్ని వెంటనే ప్రకటించిన ఇలాయానా తన భర్త గురించి మాత్రం చాలా కాలం పాటు రివిల్ చేయలేదు. బిడ్డ పుట్టడానికి ఇంకా కొదద్ఇ రోజుల సమయం మాత్రమే ఉంది అనగా మైకేల్ డొలాన్ అనే వ్యక్తిని ఇలియానా తన జీవిత భాగస్వామిగా పరిచయం చేసింది.
ప్రస్తుతం ఇలియానా తన కుటుంబంతో కలిసి అమెరికాలో నివాసం ఉంటుంది. సినిమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇన్ స్టాలో పోస్ట్ లు పెడుతూ తన సమాచారాన్ని అందిస్తుంది. అయితే తాజాగా ఇల్లు బేబీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
గర్భవతిగా ఉన్న సమయంలో కూడా వర్క్ చేయాలనుకున్నాను. కానీ ఆరోగ్యం సహకరించక నేను చేయలేకపోయాను అందుకే బ్రేక్ తీసుకున్నట్లు ఇలియానా చెప్పుకొచ్చింది. గర్భవతిగా బిడ్డను మోసినప్పుడు తనకు తన తల్లి ఎంతో అండగా ఉందని వివరించింది. ఇక తన భర్త గురించి చెబుతూ.. మైకేల్ చాలా అద్భుతమైన వ్యక్తి అని.. మా బలమైన బందాన్ని మాటల్లో చెప్పలేనని ఆమె అంది.అయితే తమ పెళ్లి గురించి కానీ, తమ రిలేషన్ గురించి కానీ ఇల్లు బేబీ సరైన సమాధానం చెప్పలేదు.
తమ బంధం గురించి గతంలో కూడా నెగిటివిటీని ఎదుర్కొవలసి వచ్చిందని తనని ఏమైనా అంటే ఊరుకుంటాను కానీ.. తన కుటుంబం గురించి కానీ , తన భర్త గురించి కానీ ఎవరైనా కామెంట్లు చేస్తే మాత్రం తట్టుకోలేనని చెప్పుకొచ్చింది.