మిరాయ్‌ రన్‌ టైమ్ ఎంతంటే..!

యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా సినిమా మిరాయ్ ప్రమోషన్స్‌తో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా, యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఇందులో తేజ సజ్జా సూపర్ యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అతని యాక్షన్ సన్నివేశాలు ఈసారి ప్రేక్షకులను కొత్తగా ఎంటర్టైన్ చేయనున్నాయి.

ఇప్పటికే సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ దక్కింది. చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం, ఇందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు థియేటర్‌లో కూర్చుని చూడగానే ఉత్సాహాన్ని కలిగిస్తాయని అంటున్నారు. మేకర్స్ ఈ సినిమా అన్ని వయస్సుల ప్రేక్షకులను మెప్పిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 49 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.

మంచు మనోజ్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది.

Related Posts

Comments

spot_img

Recent Stories