మహా కుంభమేళాలో ఓదెలా 2 టీజర్ విడుదల..భారీ లెవల్లో అంచనాలు!

కరోనా టైంలో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ సినిమాకు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ సినిమా రూపొందుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వం వహిస్తున్నా ఈ మూవీలో తమన్నా లీడ్ రోల్‌లో యాక్ట్‌ చేస్తుంది.

సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించడంతో పాటు రచన సహకారం అందిస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపించి అందరినీ తన వైపు చూసుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్‌ లాంచ్‌కి ముహూర్తం ఫిక్స్ అయింది.ఫిబ్రవరి 22న కుంభమేళాలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. మహా కుంభమేళాలో లాంచ్ అయిన మొట్టమొదటి టీజర్ ‘ఓదెల 2’ కావడం విశేషం. ఇక ఈ రోజే టీజర్ విడుదల కావడంతో మూవీ టీం ఈవెంట్ మొదలు పెట్టింది.

ఈ సందర్భంగా తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రకటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నాగసాధు గా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో మంచి పవర్ ఫుల్ గా ఉండగా.. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ సినిమా కథాంశం. ఈ టీజర్ విడుదల తర్వాత ఒక్కసారిగా అంచనాలు పెరగడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ టీజర్ కట్‌ను మేకర్స్ చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారట.

Related Posts

Comments

spot_img

Recent Stories