తెలుగు చిత్ర పరిశ్రమలో రష్మిక , విజయ్ దేవరకొండల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి సినిమా నుంచి కూడా వీరిద్దరూ ఎంతో క్లోజ్ గా ఉంటారు. వీలు చిక్కినప్పుడల్లా ఎవరికీ తెలియకుండా హాలీడే కి చెక్కేస్తుంటారు. కానీ ఆ విషయాన్ని మాత్రం ఇద్దరు బయటకు చెప్పారు.
కానీ వీరిద్దరి గురించి మాత్రం ఏదోక వార్త ఎప్పుడూ సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంటుంది. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా గీతా గోవిందం ఆ మూవీతోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా కొన్ని గుసగుసలు బయటకి వస్తున్నాయి.
అయితే విషయాన్ని మాత్రం అటు రష్మిక కానీ, ఇటు విజయ్ కానీ ఎప్పుడూ పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించదు.కొన్ని సందర్భాల్లో మాత్రమే వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చి మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే .. మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చారు కూడా. అయితే తాజాగా వీరిద్దరి గురించి ఓ వార్త నెట్టింట్లో తెగ షికారు చేసేస్తుంది.
అది ఏంటంటే… రష్మిక, విజయ్ మరోసారి మీడియా కంటికి అడ్డంగా దొరికిపోయారని .. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్ చేస్తున్నారు నెటిజన్స్. కొద్దిరోజుల క్రితం విజయ్ దేవరకొండ తన బ్రాండ్ రౌడీ వేర్ను ప్రమోట్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో విజయ్ ఓ పింక్ కలర్ క్యాప్ ను ధరించి ఉన్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవరం రోజు కూడా రష్మిక అదే కలర్ క్యాప్ ధరించి ఉన్న ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది. దీంతో ఇద్దరు ఒకేలాంటి క్యాప్ లు ఎలా పెట్టుకున్నారంటూ డౌట్లు మొదలయ్యాయి. వీరు ప్రేమలో లేరు అని చెబుతునే… ఇలా అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ ఫొటోస్ తో వీరి లవ్ ట్రాక్ గురించి మరోసారి నెట్టింట్లో చర్చ జరుగుతుంది.