బాలయ్య సినిమాలో మలయాళ నటుడు!

నందమూరి బాలకృష్ణ డైరెక్టర్‌ బాబీ కాంబోలో రాబోతున్న ఎన్బీకే 109 నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అందులో బాలయ్య బాబు తన మార్క్‌ చూపించి చెప్పిన డైలాగ్‌ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వేరే లెవల్‌ అంతే. ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది.

దుల్కర్ సల్మాన్‌ నటన గురించి వివరించాల్సిన అవసరం లేదు. సీతారామం సినిమాతో తెలుగు వారి గుండెల్లో చేరిపోయాడు. ఇప్పుడు నట సింహం బాలయ్య తో పాటు కలిసి నటిస్తున్నాడంటే.. ఆయన మీద, ఆయన నటన మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మరో మలయాళ నటుడు అయిన షైన్‌ టామ్‌ చాకోను కూడా చిత్రబృందం సంప్రదించినట్లు సమాచారం.

ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఆయనకు మొదటి సినిమా కాదు. నేచురల్ స్టార్‌ నాని నటించి మెప్పించిన దసరా సినిమాలో విలన్‌ క్యారెక్టర్‌ లో ఆయన జీవించాడనే చెప్పాలి. ఆ తరువాత నాగశౌర్య నటించిన రంగబలి సినిమాలో కూడా ఆయన విలన్‌ గా చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బాలయ్య బాబు సినిమాలో కూడా విలన్‌ గా నటిస్తే ఆయన వరుస విలన్ గా తెలుగు చిత్ర సీమలో హ్యాట్రిక్‌ కొట్టబోతున్నాడు. ఇక ఈ సినిమాలో రోజురోజుకి స్టార్ ప్రాతల సంఖ్య పెరుగుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌ కూడా నటిస్తుండడంతో హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై ఆసక్తి చూపుతున్నారు.

అంతేకాకుండా ఈ సినిమాలో గౌతమ్ మీనన్‌ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలుగా ఉన్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories