ప్రభాస్‌ కల్కిలో ఆ యువ హీరో నటిస్తున్నాడా!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 ఏడీ… ఈ చిత్రం సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ గా ప్రేక్షకుల మందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ఇంతకు ముందే ప్రకటించింది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ పై అశ్వినిదత్‌ తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె ప్రభాస్‌ కి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మే 9 న వరల్డ్ వైడ్‌ గా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ, కమల్‌ హసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కల్కి సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో టాలీవుడ్‌ ఓ యంగ్‌ హీరో కూడా నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ యంగ్‌ హీరో మరెవరో కాదు… హనుమాన్‌ చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్న తేజ సజ్జా. కొద్ది రోజుల క్రితం దుబాయ్‌ విమానాశ్రయంలో అశ్వినిదత్‌ తో  కలిసి కనిపించాడు. దీంతో కల్కి సినిమాలో తేజ నటిస్తున్నాడని ప్రేక్షకులు కన్ఫార్మ్‌ చేసేశారు.

ఇదిలా ఉండగా.. తేజ సజ్జా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను చేయాల్సిన కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయని, విషయం చెప్పడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. కల్కి సినిమాలో మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కూడా నటిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజమో తెలియాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Related Posts

Comments

spot_img

Recent Stories